Andhra Pradesh: అక్రమాస్తుల ‘ఏ1’ అవినీతిపై కమిటీ వేశారు.. దాన్ని ఏ2 విచారిస్తారట.. కలికాలం కాకపోతే ఏంటి?: నారా లోకేశ్ సెటైర్లు

  • వైఎస్ సౌరవిద్యుత్ ను యూనిట్ రూ.14కు కొన్నారు
  • మా ప్రభుత్వం రూ.2.70కే కొనుగోలు చేసింది
  • జగన్, విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు సౌర విద్యుత్ యూనిట్ ను రూ.14కు కొనుగోలు చేశారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. కానీ టీడీపీ హయాంలో సౌర విద్యుత్ యూనిట్ ను రూ.2.70 కే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. అప్పట్లో జగన్ నాయన గారి నిర్వాకంతో ఏపీ డిస్కంలకు రూ.8,000 కోట్ల నష్టం వచ్చిందని లోకేశ్ ఆరోపించారు. మహామేత ఎవరో, దార్శనికత ఉన్న నేత ఎవరో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చాలని వ్యాఖ్యానించారు.

టీడీపీ ప్రభుత్వ అవినీతిపై ఏపీ సీఎం జగన్ కేబినెట్ సబ్ కమిటీని నియమించడంపై కూడా లోకేశ్ సునిశిత విమర్శలు చేశారు. ‘అక్రమాస్తుల కేసులో ఏ1 గారు(సీఎం జగన్) అవినీతిపై కమిటీ వేశారు. దాన్ని ఏ2 విజయసాయిరెడ్డి గారు విచారణ చేస్తారట! కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి, నిజాయితీ గురించి మాట్లాడటమా!!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News