Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు భారీ ఊరట.. రూ.2,264 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ఓకే!

  • ఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు పూర్తి
  • 23 ఏళ్లలో తిరిగే చెల్లించేలా ఒప్పందం
  • వైద్య సేవలను మెరుగుపర్చేందుకు నిధుల వినియోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త. ఆర్థికలోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీకి రూ.2,264 కోట్ల రుణాన్ని అందించేందుకు ప్రపంచబ్యాంకు ముందుకు వచ్చింది. ఈ రుణాన్ని ఏపీ 23 సంవత్సరాల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది.  ఇందుకు ఆరేళ్ల అదనపు గడువు లభించనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కాగా, ప్రపంచ బ్యాంకు అందించే నిధులను ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య సేవలు, సదుపాయాలు మెరుగుపర్చేందుకు వినియోగించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా ప్రపంచబ్యాంకు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఏపీలో 2005 నాటికి పుట్టిన ప్రతి 100 చిన్నారుల్లో 54 మంది అనారోగ్యంతో చనిపోయేవారని తెలిపారు. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు తగ్గిందని తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 93 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని చెప్పారు. ఏపీలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థికవ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి సమీర్‌ కుమార్‌ ఖరే పేర్కొన్నారు.

More Telugu News