mudhami: మూడమి ప్రవేశం... మూడు నెలల పాటు శుభకార్యాలకు బ్రేక్!

  • మూడమితో పాటు శూన్యమాసాలు
  • శ్రావణమాసంలోనూ కార్యక్రమాలకు బ్రేక్‌
  • మళ్లీ అక్టోబరు 2 తర్వాత మంచి రోజులు మొదలు

వివాహాది శుభకార్యాలకు బ్రేక్‌పడింది. మూడమి ప్రవేశంతో మూడు నెలలపాటు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. మళ్లీ అక్టోబరు 2వ తేదీ తర్వాతే మంచి రోజులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఏపీ రాష్ట్ర పురోహిత విభాగం అధ్యక్షుడు శ్రీరామదుర్గం కుమారాచార్యు పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట లలితా పీఠంలో నిన్న ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు. మూడమి రోజుల్లో గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేయకూడదన్నారు. వాస్తవానికి ఏటా శ్రావణమాసంలో చక్కటి ముహూర్తాలు ఉండేవని, ఈ ఏడాది జూలై ఆషాఢమాసం కావడంతో శూన్యమాసం అయ్యిందన్నారు.

అలాగే, శ్రావణ మాసంలో కూడా మూడమి వచ్చిందని, సెప్టెంబర్‌లో వచ్చే భాద్రపదమాసం కూడా శూన్యమాసం అయ్యిందని, అందువల్ల ఈ రోజుల్లో శుభకార్యాలు నిర్వహించరాదన్నారు. ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా మూడునెలలు సుదీర్ఘకాలం శుభముహూర్తాలు లేవని, తిరిగి అక్టోబరు 2వ తేదీ తర్వాతే మంచి రోజులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

More Telugu News