Kesineni Nani: 'గౌరవనీయ ముఖ్యమంత్రి...' అంటూ జగన్ కు కేశినేని నాని ప్రశ్న!

  • అక్రమ కట్టడాలు తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం
  • కొన్ని నిర్మాణాలకే వర్తిస్తుందా?
  • అన్ని కట్టడాలనూ తొలగిస్తారా?
  • ట్విట్టర్ లో నాని సూటి ప్రశ్న

నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మితమై ఉన్న కట్టడాలను తొలగించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఏపీ ప్రభుత్వం, ఇప్పటికే ఉండవల్లిలో చంద్రబాబు సర్కారు, ప్రభుత్వ నిధులతో నిర్మితమైన ప్రజా వేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆపై కరకట్టపై ఉన్న మరో 70 వరకూ కట్టడాలకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్న వేళ, తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ ప్రశ్నను వేశారు.

"గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు... నదీ పరీవాహక చట్టం కింద అక్రమ కట్టడాలంటూ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఇది కేవలం 60 లేదా 70 నిర్మాణాలకే వర్తిస్తుందా? లేక కృష్ణా మరియు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని కట్టడాలనూ తొలగిస్తారా?" అని ప్రశ్నించారు.

More Telugu News