Abburi Chayadevi: ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఛాయాదేవి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి
  • ‘అనుభూతి’తో కథా ప్రస్థానం

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (83) కన్నుమూశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఉంటున్న ఛాయాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ  తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

13 అక్టోబరు 1933లో రాజమహేంద్రవరంలో జన్మించిన ఛాయాదేవి నిజాం కళాశాల నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. 1953లో కాలేజీ మ్యాగజైన్‌లో ‘అనుభూతి’ పేరుతో తొలి కథ రాశారు. మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలను కథా వస్తువుగా చేసుకుని పలు కథలు రాశారు. ఆమె రాసిన కథల్లో కొన్ని హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఛాయాదేవి రాసిన వాటిలో ‘బోన్‌సాయ్ బ్రతుకు’, ‘ప్రయాణం సుఖాంతం’, ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు’, ‘ఉడ్‌రోజ్’ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆమె భర్త  అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా ప్రముఖ తెలుగు రచయితే.

More Telugu News