sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఒకానొక సమయంలో 157 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • చివరకు 5 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు జోరుగానే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 157 పాయింట్ల వరకు లాభపడింది. అయితే, జూన్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్లు కోల్పోయి 39,586కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 11,841 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.95%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.37%), ఓఎన్జీసీ (1.46%), యాక్సిస్ బ్యాంక్ (1.44%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.22%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.26%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.52%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.52%), ఐటీసీ (-1.37%), ఇన్ఫోసిస్ (-1.19%).

More Telugu News