Anushka Shetty: నేను బాగానే ఉన్నా.. లవ్ యూ ఆల్: అనుష్క

  • 'సైరా' షూటింగ్ లో అనుష్క గాయపడినట్టు వార్తలు
  • సోషల్ మీడియా ద్వారా స్పందించిన స్వీటీ
  • సియాటిల్ లో షూటింగ్ లో ఉన్నానన్న అనుష్క

సినీ నటి అనుష్క 'సైరా' సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్టు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆమె కాలికి గాయమయిందని... కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు ఆమెకు సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై సోషల్ మీడియా ద్వారా అనుష్క స్పందించింది.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని అనుష్క తెలిపింది. సియాటిల్ లో షూటింగ్ లో పాల్గొంటున్నానని... లవ్ యూ ఆల్ అని చెప్పింది. ప్రస్తుతం 'సైలెన్స్' అనే చిత్రంలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అమెరికాలోని సియాటిల్ లో షూటింగ్ జరుగుతోంది.

More Telugu News