Telangana: ఆ ధనాన్ని ఉస్మానియా ఆసుపత్రి, ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణకు వెచ్చించండి!: ఎమ్మెల్యే రాజాసింగ్ హితవు

  • కొత్త సచివాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించాను
  • అందుకే నన్ను రజాకార్ల సర్కారు అరెస్ట్ చేసింది
  • శిథిలావస్థలో ఉన్న ఉస్మానియాను పునరుద్ధరించాలి

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణాన్ని తాను వ్యతిరేకించానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దీంతో కేసీఆర్ నేతృత్వంలోని రజాకార్ల ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీ మొత్తంతో కొత్త సచివాలయం కట్టే బదులుగా, ఆ మొత్తాన్ని ఉస్మానియా ఆసుపత్రి ఆధునికీకరణ, స్కూళ్ల నిర్మాణం కోసం వెచ్చించాలని సూచించారు.

రాష్ట్రంలో చాలాచోట్ల పాఠశాలలు దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లో రూ.400 కోట్లతో సచివాలయం, రూ.100 కోట్లతో అసెంబ్లీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News