vijaya nirmala: విజయనిర్మల నివాసానికి చేరుకున్న మహేశ్ బాబు

  • విజయనిర్మల నివాసానికి భౌతికకాయం తరలింపు
  • కంటతడి పెట్టిన కృష్ణ
  • నివాళి అర్పించిన మహేశ్ బాబు

దివంగత విజయనిర్మల భౌతికకాయాన్ని కాసేపటి క్రితం హైదరాబాదులోని ఆమె నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో, ఆమెను కడసారి చూసుకునేందుకు సినీ ప్రముఖులు అక్కడకు తరలి వస్తున్నారు. ఆమె భర్త కృష్ణ భౌతికకాయం పక్కనే ఉండి, కంటతడి పెట్టడం అక్కడున్న వారిని కలచివేసింది. కాసేపటి క్రితం మహేశ్ బాబు తన భార్య, పిల్లలతో కలసి అక్కడకు వచ్చారు. విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్థివ దేహానికి చేతులెత్తి నమస్కరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.

More Telugu News