ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే జీతం కట్!: సీఎం యోగి ఆదిత్యనాథ్

27-06-2019 Thu 12:06
  • ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక
  • ప్రవర్తన బాగోలేకపోతే విధుల నుంచి తొలగింపు
  • ఆదేశాలు జారీచేసిన ఉత్తప్రదేశ్ సీఎం
ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు సమయానికి ఆఫీసుకు వచ్చి వెళ్లిపోతుంటారు. మరికొందరు మాత్రం ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరవుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి అధికారులపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఉదయం 9 గంటలకల్లా ఠంచనుగా ఆఫీసులకు రావాలని సీఎం యోగి ఆదేశించారు.

ఒకవేళ ఎవరైనా అధికారులు సమయానికి ఆఫీసుకు రాకుంటే వారి జీతాన్ని కట్ చేస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన ప్రవర్తన లేని ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం మొదలయింది.