Look-out Notice: రేప్ కేసులో కేరళ సీపీఎం నేత కుమారుడిపై లుక్ అవుట్ నోటీసు జారీ

  • బినయ్ కొడియెరిపై అత్యాచారం ఆరోపణలు
  • వివాహం పేరుతో అత్యాచారం చేశాడంటూ బార్ డ్యాన్సర్ ఫిర్యాదు
  • ముందస్తు బెయిలు కోసం ముంబై కోర్టులో నిందితుడి దరఖాస్తు

వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ బార్ డ్యాన్సర్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ సీపీఎం నేత, రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్ కుమారుడు బినయ్ కొడియెరి (37) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన కోసం ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మధ్యంతర బెయిలు కోసం బినయ్ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు అది విచారణకు రానుంది. అయితే, అంతకంటే ముందే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతడు కనిపిస్తే తమకు సమాచారం అందించాలంటూ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను, ఇతర సంస్థలను పోలీసులు కోరారు.  

కాగా, ఇప్పటికే కేరళ చేరుకున్న ముంబై పోలీసులు కొడియెరి నివాసంలో గాలించారు. 33 ఏళ్ల బార్ డ్యాన్సర్.. కొడియెరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడి వల్ల ఓ బాబుకు కూడా జన్మనిచ్చినట్టు తెలిపింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బినయ్ కోసం అప్పటి నుంచి గాలిస్తునే ఉన్నారు.

More Telugu News