Krishna: మీకు తెలుసా?... హీరో కృష్ణకు చెల్లిలిగానూ చేసిన విజయనిర్మల!

  • గిన్నిస్ రికార్డు సాధించిన విజయనిర్మల
  • మూడు చిత్రాల్లో కృష్ణకు సోదరిగా 
  • ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

గిన్నిస్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకురాలు విజయనిర్మల, తన నిజ జీవిత హీరో, సూపర్ స్టార్ కృష్ణకు సోదరిగానూ నటించిన సినిమాలు ఉన్నాయని తెలుసా? వీరిద్దరూ ప్రేమలో పడ్డ తరువాతే ఆ చిత్రాలు వెండితెరను తాకాయి. విజయనిర్మల, కృష్ణలు కలిసి దాదాపు 50 చిత్రాల్లో నటించినా, 'బొమ్మలు చెప్పిన కథ', 'మంచి మిత్రులు', 'ముహూర్త బలం' చిత్రాల్లో ఆమె కృష్ణకు సోదరిగా నటించారు. 'మంచి మిత్రులు' చిత్రంలో శోభన్ బాబు హీరో. అయితే, ఈ మూడు చిత్రాలూ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమై, ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో తామిద్దరమూ అన్నా చెల్లెలుగా ప్రేక్షకులను మెప్పించలేమన్న నిర్ణయానికి వచ్చేసిన విజయనిర్మల, కృష్ణతో కలిసి హీరోయిన్ గా తప్ప మరో పాత్ర చేయరాదని నిర్ణయించుకున్నారు. 

More Telugu News