Vijayanirmala: దర్శకురాలిగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన విజయనిర్మల

  • 44 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల
  • మీనా అనే సినిమాకు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు
  • అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రపంచంలోనే తొలి మహిళా దర్శకురాలు

విజయనిర్మల నటిగానే కాదు, దర్శకురాలిగానూ అందరికీ సుపరిచితమే. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిస్‌బుక్ రికార్డులకెక్కారు. మొత్తంగా ఆమె 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1973లో ‘మీనా’ అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించిన విజయ నిర్మల ఆ తర్వాత  దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ తదితర 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. సొంత నిర్మాణ సంస్థ ‘విజయకృష్ణ’ను స్థాపించి ఆ పతాకంపై 15కుపైగా సినిమాలు నిర్మించారు.

More Telugu News