North Korea: అమెరికా, ఉత్తర కొరియా మధ్య మళ్లీ రాజుకుంటున్న నిప్పు

  • అణ్వస్త్ర నిరాయుధీకరణకు ట్రంప్, కిమ్ చర్చలు
  • ఫలవంతం కాని చర్చలు
  • తమపై అమెరికా ఆధిపత్యానికి ప్రయత్నిస్తోందంటూ కొరియా మండిపాటు

గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు సాధించలేని విధంగా డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తో చెలిమిని సాధించారు. అణ్వస్త్ర నిరాయుధీకరణ లక్ష్యంగా ట్రంప్, కిమ్ చర్చలు కూడా జరిపారు. ట్రంప్ నుంచి అద్భుతమైన మ్యాటర్ తో కూడిన వ్యక్తిగత లేఖ అందిందని ఉత్తర కొరియా, కిమ్ నుంచి ఓ అందమైన లేఖ వచ్చిందని ట్రంప్ పేర్కొనడంతో రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని అందరూ విశ్వసించారు.

 కానీ, అంతలోనే ఉత్తర కొరియా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తోంది. తమపై అధిపత్యానికి అమెరికా ప్రయత్నిస్తోందని, కఠిన ఆంక్షలకు భయపడేదిలేదని ఉత్తర కొరియా వర్గాలు తెగేసి చెబుతున్నాయి. తమ సార్వభౌమాధికారాన్ని ఎవరైనా ప్రశ్నార్థకం చేస్తే అలాంటివారి నుంచి కాపాడుకునేందుకు సైనిక శక్తిని తప్పకుండా వినియోగిస్తామని ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

More Telugu News