BV Raghavulu: ప్రజావేదికతో సరిపెట్టుకుంటే మాత్రం జగన్ ను అనుమానించాల్సి వస్తుంది: బీవీ రాఘవులు

  • గత ప్రభుత్వం నోటీసులతో సరిపెట్టుకుంది
  • ఎక్కడ అక్రమకట్టడం ఉన్నా కూల్చివేయాల్సిందే
  • రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రజావేదిక కూల్చివేత

ఉండవల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక కట్టడాన్ని జగన్ సర్కారు కూల్చివేస్తుండడం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శిస్తుండగా, మరికొందరు అక్రమకట్టడాలు ఎక్కడున్నా కూల్చేయాలంటూ ప్రభుత్వ వైఖరిని ప్రోత్సహిస్తున్నారు.

 ఈ క్రమంలో సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు కూడా ప్రజావేదిక కూల్చివేతపై స్పందించారు. గత ప్రభుత్వం అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుందని అన్నారు. అయితే, ఇప్పటి ప్రభుత్వం కేవలం ప్రజావేదికను కూల్చి అంతటితో సరిపెట్టుకుంటే మాత్రం జగన్ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రజావేదికను కూల్చి అంతటితో ఆగకుండా, కృష్ణా నది కరకట్ట పరిధిలో ఎక్కడ అక్రమకట్టడం ఉన్నా కూల్చివేయాల్సిందేనని రాఘవులు అన్నారు.

More Telugu News