Andhra Pradesh: ఇంజనీర్లు, సెక్రటరీలను సీఎం జగన్ చెప్పన్నా.. చెప్పన్నా అంటున్నారు.. ఏందయ్యా చెప్పేది?: దేవినేని ఉమ ఘాటు విమర్శలు

  • పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తిచేశాం
  • మీ నాన్న మట్టి పనులు మాత్రమే చేశారు
  • ఏదైనా డౌటుంటే మీ తండ్రి ఆత్మను అడుగు

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా లేవలేదని ఏపీ సీఎం జగన్ గతంలో విమర్శించారని, కానీ తమ హయాంలో పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి అయ్యాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం కాలువల్లో మట్టిని తీసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాజశేఖరరెడ్డి ఆత్మ(కేవీపీ రామచంద్రరావు)ను అడగాలనీ, ఆయన ఢిల్లీలో ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘పోలవరంలో అవినీతి జరిగింది.. అవినీతి జరిగింది.. అవినీతి జరిగింది అన్నావ్. ఓ... అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడావు రోడ్డు మీద. అన్నా.. ఇంజనీర్ అన్నా.. సెక్రటరీ అన్నా.. చెప్పన్నా.. సన్మానం చేస్తానన్నా..అవినీతి గురించి చెప్పన్నా.. చెప్పన్నా.. ఏందయ్యా ఇది? ఒక ముఖ్యమంత్రి అధికారి, సెక్రటరీని చెప్పన్నా.. చెప్పన్నా అంటే ఏందయ్యా చెప్పేది? ఏదయినా ఉంటే కదా చెప్పడానికి’ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News