pilli subhaschandrbose: టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన వెబ్‌ల్యాండ్‌ విధానం భేష్‌ : మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

  • కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి
  • ఔట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్లే డేటా మార్చేస్తున్నారు
  • రైతుల అనుమతి లేకుండా మార్చే విధానాన్ని రద్దు చేస్తాం

భూ వివరాలు, రికార్డు నిర్వహణకు సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వెబ్‌ల్యాండ్‌ విధానం మంచిదేనని, కాకపోతే అందులో కొన్ని లోపాలు ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ అన్నారు. ముఖ్యంగా రికార్డుల్లో వివరాలు మార్చే అధికారం ఔట్‌సోర్సింగ్‌ డేటా ఆపరేటర్ల చేతుల్లో ఉండడం సరికాదన్నారు. దీనివల్ల వీరు ఇష్టానుసారం రికార్డు మార్చేసి రైతుల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భూములపై సర్వహక్కులు రైతులవని, వారి అనుమతి లేకుండా ఎటువంటి మార్పులు చేయకూడదన్నారు. అందువల్ల రైతుల అనుమతి లేకుండా రికార్డులు మార్చే అధికారం లేకుండా చేయనున్నట్లు తెలిపారు.

More Telugu News