kcr: అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇవన్నీ అవసరమా?: కేసీఆర్ పై చాడ ఫైర్

  • తెలంగాణ అప్పుల్లో ఉందని కేంద్రం ప్రకటించింది
  • కొత్త అసెంబ్లీ, సచివాలయం అవసరమా?
  • తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేసిన ఆయన... ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని... ఆయన పద్ధతి మార్చుకోవాలని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని... వాటన్నింటినీ ప్రభుత్వం నివృత్తి చేయాలని చాడ డిమాండ్ చేశారు. విశాఖ శారదాపీఠానికి ఒక రూపాయికి ఒక ఎకరం చొప్పున భూమిని కేటాయించారని... ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని మండిపడ్డారు. శారదా పీఠానికి భూములిచ్చిన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని దుయ్యబట్టారు.

More Telugu News