prajavedika: 'ప్రజావేదిక' కూల్చివేత పనులు 80 శాతం పూర్తి

  • నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన కూల్చివేత పనులు
  • వర్షం కారణంగా పనులకు స్వల్ప అంతరాయం
  • కరకట్ట ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

ప్రజావేదికను కూల్చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో... కూల్చివేత కార్యక్రమం రాత్రంతా కొనసాగింది. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా భవనాన్ని నేలమట్టం చేశారు. ఈ ఉదయం వర్షం కురవడంతో, కూల్చివేత పనులకు స్వల్ప ఆటంకం కలిగింది. అనంతరం, కూల్చివేతను మళ్లీ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ... ఊహించని విధంగా నిన్న రాత్రి నుంచే పనులు మొదలు పెట్టారు. మరోవైపు, ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు.

More Telugu News