Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చైతూ సరసన కీర్తి సురేశ్ 
  • కేఏ పాల్ పాత్రలో సునీల్?
  • బాలకృష్ణతో 'కల్కి' దర్శకుడు  

*  అక్కినేని నాగ చైతన్య సరసన కీర్తి సురేశ్ జతకట్టనుంది. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రంలో చైతన్య కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో అతని సరసన కీర్తిని తీసుకుంటున్నారట.  
*  ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, ఇటీవల రాజకీయాలలో తన స్టేట్మెంట్లతో కామెడీ సృష్టించిన కేఏ పాల్ పాత్ర తెరకెక్కనుంది. ఈయన జీవన ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని ఓ చిత్రం రూపొందనున్నట్టు, ఇందులో పాల్ పాత్రను ప్రముఖ హాస్య నటుడు సునీల్ పోషించనున్నట్టు తెలుస్తోంది.
*  తాజాగా రాజశేఖర్ తో 'కల్కి' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో బాలకృష్ణతో ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది ప్రయోగాత్మక చిత్రమని, టాలీవుడ్ లో ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదని ప్రశాంత్ వర్మ చెప్పాడు. 

More Telugu News