Australia: కళ్లుచెదిరే యార్కర్ తో స్టోక్స్ ను బౌల్డ్ చేసిన స్టార్క్... ఓటమి దిశగా ఇంగ్లాండ్

  • ఆసీస్ స్కోరు 285/7
  • లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 38 ఓవర్లలో 183/6
  • 89 పరుగులు చేసిన స్టోక్స్

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది. ధాటిగా ఆడుతున్న ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను మిచెల్ స్టార్క్ ఓ తిరుగులేని యార్కర్ తో బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గింది. అప్పటివరకు స్టోక్స్ దూకుడు చవిచూసిన ఆసీస్ అతడు అవుట్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్టోక్స్ 89 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 38 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 12 ఓవర్లలో 103 పరుగులు చేయాలి.

More Telugu News