prakasam: ఒంగోలులో గ్యాంగ్ రేప్ బాలికకు రూ.10 లక్షల పరిహారం: హోం మంత్రి సుచరిత

  • బాలికను పరామర్శించిన మంత్రులు
  • ఆ బాలికకు భద్రత కల్పిస్తాం
  • ప్రస్తుత చట్టాలను బలోపేతం చేయాలి 

ఒంగోలులో గ్యాంగ్ రేప్ నకు గురైన బాలికను హోం మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాసరావు, తానేటి వనిత  పరామర్శించారు. బాలికకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని, దీంతో పాటు ఆమెకు భద్రత కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు మరెవ్వరూ ఉండరన్న విషయాన్ని పిల్లలు తెలుసుకోవాలని సూచించారు. పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రస్తుత చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లా చినగంజాంలో టీడీపీ కార్యకర్త పద్మ ఆత్మహత్యపై సుచరిత స్పందించారు. దాడి చేసింది ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని, వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు.

More Telugu News