Australia: ఫించ్ అవుటైన తర్వాత చేతులెత్తేసిన ఆసీస్... ఇంగ్లాండ్ లక్ష్యం 286 పరుగులు

  • ఆరోన్ ఫించ్ సెంచరీ
  • నిరాశపరిచిన ఆసీస్ మిడిలార్డర్
  • రాణించిన ఇంగ్లాండ్ బౌలర్లు

లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (100) క్రీజులో ఉన్నంతసేపు 340 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించిన ఆసీస్, ఫించ్ అవుట్ కాగానే పరుగులు తీయడానికి ఆపసోపాలు పడింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో కనీసం 300 పరుగుల మార్కు కూడా చేరుకోలేకపోయింది.

మ్యాక్స్ వెల్, స్టొయినిస్ నిరాశపరిచారు. స్మిత్ 38 పరుగులు చేసినా బ్యాట్ ఝుళిపించే సమయంలో అవుట్ కావడంతో ఆసీస్ భారీ స్కోరు ఆశలకు బ్రేక్ పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 27 బంతుల్లో 38 పరుగులు చేయడంతో కంగారూలకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసి ఆసీస్ ను కట్టడిచేశారు. వోక్స్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, వుడ్, స్టోక్స్, అలీ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ఆసీస్ పై ఒత్తిడి పెంచారు.

More Telugu News