Australia: లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసి అవుటైన ఆసీస్ కెప్టెన్

  • ఆసీస్ 36 ఓవర్లలో 3 వికెట్లకు 190
  • వార్నర్ అర్ధసెంచరీ
  • టాస్ గెలిచి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లాండ్

లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు సారథి ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా బరిలో దిగిన ఫించ్ ధాటిగా ఆడుతూ 115 బంతుల్లో 100 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఫించ్ 11 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. అయితే, సెంచరీ పూర్తిచేసుకున్న కాసేపటికే ఆర్చర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ టోర్నీలో ఫించ్ కి ఇది రెండో శతకం. అంతకుముందు, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. వార్నర్ 61 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖవాజా 23 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్, మ్యాక్స్ వెల్ ఆడుతుండగా ఆసీస్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

More Telugu News