Visakhapatnam: సికింద్రాబాద్, విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు... వివరాలివి!

  • విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు స్పెషల్ రైళ్లు
  • విశాఖ నుంచి తిరుపతికి కూడా
  • వెల్లడించిన విజయవాడ రైల్వే డివిజన్

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా హైదరాబాద్, విశాఖపట్నం నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు స్పెషల్ ట్రయిన్స్ నడిపించనున్నామని విజయవాడ రైల్వే డివిజన్‌ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ కు ప్రత్యేక రైలు (08501) జూలై 2, 9, 16, 23, 30వ తేదీల్లో, ఆపై ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో, తదుపరి సెప్టెంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో ఉంటుందని తెలిపింది. ఈ రైలు రాత్రి 11.00 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి తదుపరి రోజు 12.00 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని తెలిపింది.

ఇక ఇదే రైలు (08502) మరుసటి రోజు సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.50కి విశాఖ చేరుతుందని పేర్కొంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు (08573) జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో, ఆపై ఆగస్టులో 5, 12, 19, 26 తేదీల్లో, తదుపరి సెప్టెంబర్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో ఉంటాయని తెలిపింది. ఈ రైలు విశాఖలో రాత్రి 10.55కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25కు తిరుపతి చేరుతుందని, ఇదే రైలు తిరుపతి నుంచి (08574) మధ్యాహ్నం 3.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కి విశాఖపట్నం చేరుతుందని వెల్లడించింది.

More Telugu News