Pakistan: అనవసరంగా తిట్టేశాం.. మమ్మల్ని క్షమించు: సర్ఫరాజ్‌ను కోరిన పాక్ ఫ్యాన్స్

  • దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత మారిన అభిమానుల స్వరం
  • సెమీస్ రేసులో నిలిచిన పాక్
  • క్షమించాలంటూ మ్యాచ్‌లో బ్యానర్లు ప్రదర్శించిన అభిమానులు

ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. మ్యాచ్ మధ్యలో ఆవలించాడని, ప్రధాని ఇమ్రాన్ సూచనలను పెడచెవిన పెట్టాడని మండిపడ్డారు. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించాక ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు. తొందరపడ్డామని, క్షమించాలని వేడుకుంటున్నారు. నిజాయతీని, పట్టుదలను శంకించినందుకు తమను క్షమించాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ‘‘సర్ఫరాజ్ మమ్మల్ని క్షమించు’’ అని రాసిన బ్యానర్లను  దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అభిమానులు ప్రదర్శించారు. మ్యాచ్ అనంతరం అభిమానులతో సర్ఫరాజ్ చేతులు కలుపుతున్న వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.  

దక్షిణాఫ్రికాతో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలబడింది. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచిన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లతో జరిగే మ్యాచుల్లో పాక్ విజయం సాధిస్తే ఆ జట్టు సెమీస్ చేరుకునే అవకాశాలున్నాయి. అయితే, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగని కివీస్‌పై విజయం సాధించడం ఏమంత తేలిక కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News