Shakib Al Hasan: ఎనిమిదేళ్ల నాటి యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు... షకీబుల్ నయా ఫీట్!

  • 2011లో 50 పరుగులు, 5 వికెట్లు సాధించిన యువీ
  • నిన్నటి మ్యాచ్ లో రికార్డు బద్దలు 
  • ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన షకీబుల్

నిన్న ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 2011 లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డు ఒకటి బద్దలైంది. ఆనాడు ఆల్ రౌండర్ గా యువీ ఓ మ్యాచ్ లో 50 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో ఏకంగా 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పగా, దాన్ని నిన్న బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ దాటేశాడు.

69 బంతుల్లో 51 పరుగులు సాధించడంతో పాటు, 10 ఓవర్లు బౌలింగ్ చేసి, 29 పరుగులు మాత్రమే ఇచ్చి, 5 వికెట్లు తీశాడు. దీంతో పాటు ఈ మ్యాచ్ లో షకీబుల్ పేరిట మరిన్ని రికార్డులు నమోదయ్యాయి. వరల్డ్ కప్ పోటీల్లో బంగ్లాదేశ్‌ తరపున వెయ్యి పరుగులు పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌ మెన్‌ గా చరిత్రను సృష్టించాడు. ఇప్పటివరకూ షకీబుల్‌ హసన్‌ 537 పరుగులు చేసి, మిగతా అందరి కన్నా ముందు నిలువగా, 447 పరుగులతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌ కొనసాగుతున్నాడు.

More Telugu News