Jagan: అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది?: జగన్ సర్కార్ కు నారా లోకేశ్ ప్రశ్న

  • బురద జల్లేందుకే బీజేపీ, వైసీపీ ప్రయత్నం
  • గతంలోనే పెంచిన అంచనాలకు కేంద్రం ఆమోదం
  • వైకాపా డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా
  • ట్విట్టర్ లో వరుస ట్వీట్లు

తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకే బీజేపీ, వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన ఆయన, "తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రూ. 55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది?" అని అడిగారు.

ఆపై "అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైకాపా డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు" అని అన్నారు. "ఇప్పటికైనా బీజేపీ వైకాపా నాయకులు తెదేపా మీద బురదజల్లడం మాని, మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిది" అని మరో ట్వీట్ లో సలహా ఇచ్చారు.

More Telugu News