world cup: షకీబల్ హసన్ ఆల్‌రౌండ్ షో.. ఆఫ్ఘనిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం

  • షకీబల్ దెబ్బకు ఆఫ్ఘన్ విలవిల
  • ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఓడిన ఆప్ఘన్ జట్టు
  • ఐదో స్థానంలో బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో 51 పరుగులు చేసిన షకీబల్ హసన్ బౌలింగ్‌లోనూ రాణించి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ 36, షకీబల్ హసన్ 51, ముస్తాఫికర్ రహీం 83, మొతాదిక్ హొస్సైన్ 35 పరుగులు చేశారు.

అనంతరం 263 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు షకీబల్ బౌలింగ్ దెబ్బకు విలవిల్లాడింది. వరుసపెట్టి వికెట్లు కోల్పోయి విజయానికి 62 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ 47, సమియుల్లా షిన్వరి 49(నాటౌట్) పరుగులతో రాణించినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ భారీ భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యారు.

చివర్లో 12 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయింది. మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 200 పరుగులకు ఆలౌట్ అయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద అవార్డు’ దక్కింది. కాగా, ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఓడిన ఆఫ్ఘనిస్థాన్ పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉండగా, ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది.

More Telugu News