Nirmala Sitharaman: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయమై లిఖిత పూర్వక సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్

  • ప్రశ్నించిన బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్
  • ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరాయి
  • పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదు

ప్రత్యేక హోదా విషయమై నేడు లోక్‌సభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ ప్రశ్నించగా, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా విషయమై నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ కేంద్రాన్ని కోరుతూనే ఉంటామని జగన్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు.

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సందర్భంగా కూడా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. అయితే నేడు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా కోసం ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు కోరాయన్నారు. ప్రణాళిక మద్దతు కోసమే జాతీయాభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

More Telugu News