Tapsi: తాప్సి సినిమాల కారణంగా.. ఆమె సోదరి తెగ భయపడిపోతోందట!

  • ‘మన్మర్జియా’లో తాప్సి చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంది
  • నిజ జీవితంలోనూ ఓ సందర్భంలో అలాగే ప్రవర్తించిందట
  • ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చిన తాప్సి 

హిట్, ఫట్‌లతో  సంబంధం లేకుండా దూసుకుపోతున్న తారల్లో తాప్సి ఒకరు. టాలీవుడ్‌లో పెద్దగా రాణించకపోయినా, ఇతర చిత్రసీమల్లో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తను చేసిన సినిమాల్లోని క్యారెక్టర్స్ నుంచి నిజ జీవితంలోనూ బయటకు రాలేకపోతోందట. దీంతో తన సోదరి విపరీతంగా భయపడిపోతోందట. ఈ విషయాలను తాప్సి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమా ‘మన్మర్జియా’. ఆ చిత్రంలో తాప్సి చాలా రాష్‌గా ప్రవర్తిస్తూ, ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే దుమ్ముదులిపేస్తుంటుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిజ జీవితంలో జరిగిన ఓ సందర్భాన్ని తాప్సి ఆంగ్ల మీడియాకు వివరించింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఓ సారి తన సోదరితో కలిసి బయటకు వెళ్లిందట. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ వ్యక్తి తనను ఫోటోలు తీయడం గమనించి  అతని వద్దకెళ్లి ఫోన్ లోపల పెడతావా? లేదంటే పగలగొట్టనా? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిందట. దీంతో ఆ ఫోటోలు తీస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆమె సోదరి మాత్రం భయపడిపోయి సైలెంట్‌గా ఉండిపోయిందట.

తాప్సి ‘బద్లా’ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆమె సోదరి ఇలాగే తెగ భయపడిపోయేదట. ఎందుకంటే ఆ చిత్రంలో తాప్సి ఓ వ్యక్తిని మర్డర్ చేస్తుంది. పాత్రలో లీనమైపోయి నిజ జీవితంలోనూ ఎవరినైనా చంపేస్తానేమోనని తన సోదరి బాగా భయపడిందని తాప్సి తెలిపింది. 

More Telugu News