అప్పటివరకూ నేను సంపాదించిందంతా 'ఇద్దరు' సినిమాతో పోయింది: మురళీమోహన్

24-06-2019 Mon 15:47
  • 'ఇద్దరు' సినిమాతో నష్టాలు వచ్చాయి
  •  వ్యాపార భాగస్వాములు మోసం చేశారు
  • రియల్ వ్యాపారంలో నిలబడ్డాను

మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ చేయడమే ఇష్టం. అందువలన సినిమాల్లోకి వచ్చిన తరువాత, రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో భాగస్వామిగా పెట్టుబడులు పెట్టాను. ఎంజీఆర్ - కరుణానిధి కథతో తెరకెక్కిందని అంతా చెప్పడంతో, 'ఇద్దరు' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాము. ఆ సినిమా తొలి ఆటతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, రెండవ ఆటకే వసూళ్లు పడిపోయాయి.

అప్పటివరకూ సంపాదించిందంతా ఆ సినిమా కారణంగా పోయింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లోని భాగస్వాములు మోసం చేయడంతో మరో దెబ్బ తగిలింది. ఆ తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్ పై దృష్టి పెట్టాను. ఆ వ్యాపారంలో సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లాను. నిజాయతీతో నిలబడిగలిగాను" అని చెప్పుకొచ్చారు.