boris becker: అప్పులు తీర్చేందుకు ట్రోఫీలను వేలం వేస్తున్న టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్

  • అప్పుల ఊబిలో కూరుకుపోయిన బెకర్
  • బెకర్ వస్తువులను వేలానికి పెట్టిన బ్రిటీష్ కంపెనీ వైల్స్ హార్డీ
  • కెరీర్లో 49 టైటిళ్లను గెలిచిన బెకర్

బోరిస్ బెకర్... ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. వింబుల్డన్ ను సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర పుటల్లో నిలిచి పోయాడు ఈ జర్మన్ టెన్నిస్ స్టార్. తన కెరీర్ లో అత్యున్నత స్థాయికి ఎదిగి... పేరుతో పాటు ఎంతో సంపాదనను కూడా సొంతం చేసుకున్నాడు. తదనంతర కాలంలో అనేక కారణాలతో ఆయన ఆర్థికంగా చితికిపోయాడు. 2017లో బెకర్ దివాలా తీసినట్టు ప్రకటన వెలువడింది.

ఈ నేపథ్యంలో, తన అప్పులను తీర్చేందుకు 51 ఏళ్ల బెకర్ తన సర్వస్వాన్ని వేలానికి పెట్టాడు. తాను సాధించిన ట్రోఫీలు, కప్పులు... తాను ఎంతో ఇష్టంగా సేకరించిన వాచీలు, ఫొటోగ్రాఫ్ లు... ఇలా అన్నింటిని వేలం వేస్తున్నాడు. వైల్స్ హార్డీ అనే బ్రిటీష్ వేలం కంపెనీ వీటిని వేలానికి ఉంచింది. జూలై 11 వరకు ఇవి అందుబాటులో ఉంటాయని సదరు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. అయితే మిలియన్ల పౌండ్ల అప్పుల్లో కూరుకుపోయిన బెకర్ కు... ఈ వేలంపాట ద్వారా వచ్చే ఆదాయం ఎంత మాత్రం సరిపోదని సమాచారం. తన కెరీర్లో 49 టైటిళ్లను గెలిచిన బెకర్... 20 మిలియన్ యూరోల కన్నా ఎక్కువగానే సంపాదించాడు.

More Telugu News