'నా కోసం కూడా ఇలా అభిమానులు వస్తారా?' అని అప్పట్లో చిరంజీవి అడిగారు: మురళీమోహన్

24-06-2019 Mon 13:08
  • 'మనవూరి పాండవులు' కలిసి చేశాము
  •  నన్ను 'అన్నయ్యా' అని చిరంజీవి పిలిచేవాడు
  • చిరంజీవితో ఆ మాట చెప్పానన్న మురళీ మోహన్   

తాజా ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ, చిరంజీవితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. 'మనవూరి పాండవులు' సినిమా నుంచి చిరంజీవి నన్ను 'అన్నయ్యా' అని పిలిచేవాడు. అప్పటికే నేను కొన్ని సినిమాలు చేసి ఉండటం వలన, నాకు ఎక్కువ క్రేజ్ ఉండేది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు వచ్చి నా చుట్టూ చేరేవారు.

అది చూసిన చిరంజీవి 'నా కోసం కూడా ఇలా అభిమానులు వస్తారా?' అని అడిగాడు. 'తప్పకుండా వస్తారు .. నువ్వు అంత గొప్పవాడివి అవుతావు' అని నేను చెప్పాను. 'మనవూరి పాండవులు' సినిమాలో చిరంజీవి నటన .. డాన్స్ చూసే ఆయన పెద్ద హీరో అవుతాడని అనుకున్నాను .. అలాగే జరిగింది. మొదటి సినిమాకి చిరంజీవి ఎంత కష్టపడ్డాడో .. ఇప్పుడూ అంతే కష్టపడతాడు. అదే ఆయనలో నాకు నచ్చే గుణం" అని ఆయన చెప్పుకొచ్చారు.