jagan: గ్రామ వాలంటీర్లకు ప్రారంభంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన జగన్

  • 1,70,543 గ్రామ వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ జారీ
  • అవినీతికి తావు లేకుండా పనిచేయాలన్న సీఎం
  • తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్

ఏపీలోని 13 జిల్లాల్లో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం నిన్న నోటిఫికేషన్ వెలువడింది. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను ప్రభుత్వం నియమించబోతోంది. మొత్తం 1,70,543 గ్రామ వాలంటీర్ల కోసం జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ నేపథ్యంలో, గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపిక కాకముందే... వారికి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్ కు నెలకు రూ. 5 వేల వేతనాన్ని చెల్లించబోతున్నామని... అవినీతికి తావు లేకుండా పని చేయాలని చెప్పారు. గ్రామ వాలంటీర్ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా అమలు చేస్తామని తెలిపారు.

More Telugu News