england: అచ్చం మనుషుల్లాగే రాగాలు తీస్తున్న సీల్స్.. బ్రిటన్ శాస్త్రవేత్తల ఘనత!

  • సెయింట్ ఆండ్రూస్ శాస్త్రవేత్తల ఘనత
  • మూడు సీల్స్ కు శిక్షణ ఇచ్చిన శాస్త్రవేత్తలు
  • పాటలకు అనుగుణంగా గొంతు కలుపుతున్న సీల్స్

సముద్రాల్లో ఉండే సీల్స్ మనుషులను అనుకరిస్తాయా? అంటే బ్రిటన్ శాస్త్రవేత్తలు అవుననే జవాబు ఇస్తున్నారు. స్కాట్ లాండ్ లోని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మనుషుల్లా శబ్దాలను అనుకరించేలా సీల్స్ కు శిక్షణ ఇచ్చారు. మూడు సీల్స్ పిల్లలను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పెంచారు.

అనంతరం మనుషుల శబ్దాలను అనుకరించేలా శిక్షణ ఇచ్చారు. వీటిలో జోలా అనే సీల్ దాదాపు 10 రకాల శబ్దాలను అనుకరించగలదట. ఈ అధ్యయనం మాట్లాడేందుకు ఇబ్బందులు పడే చిన్నారులకు చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నట్లు ఈ సీల్స్ సంగీతాన్ని అనుకరిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

More Telugu News