indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై 7.5 గా నమోదు

  • యందేనా ఐలాండ్‌లోని సోంలకి తీరంలో భూకంపం 
  • యాంబన్‌ దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • 30 సెకన్ల పాటు ప్రకంపనలు

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. యాంబన్‌ దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద సముద్ర ఉపరితలానికి 214 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యందేనా ఐలాండ్‌లోని సోంలకీ సముద్రతీరంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.5 శాతంగా నమోదైంది.

దాదాపు 30 సెకన్లపాటు భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సముద్రగర్భంలో భూకంపం వచ్చిన కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. కాగా జపాన్‌లోనూ భూకంపం వచ్చినట్లు, రిక్టర్‌ స్కేల్‌పై ఇది 5.5 తీవ్రతతో ఇది సంభవించినట్లు జపాన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News