Telangana: తెలంగాణ కొత్త సచివాలయ నమూనా ఇది!

  • డిజైన్ ను అందించిన తమిళనాడు సంస్థ
  • గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తున్న ప్రభుత్వం
  • 'షాపూర్ జీ-పల్లోంజీ'కి దక్కనున్న చాన్స్!

రాజ ప్రాసాదాన్ని తలపిస్తున్న ఈ భవంతి తెలంగాణ కొత్త అసెంబ్లీ భవన ఆకృతి ప్రతిపాదన. తెలంగాణ సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు గ్లోబల్ టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మోడల్ ను చెన్నైకి చెందిన ఓ సంస్థ తెలంగాణ సర్కారుకు పంపింది. ఈ భవన నమూనా అందరికీ నచ్చినట్టు సమాచారం.

ఇక కొత్త సచివాలయం, శాసనసభల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రోజునే గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నామినేషన్ వేయడానికి మొగ్గు చూపితే, 'షాపూర్ జీ - పల్లోంజీ' సంస్థకే పనులను అప్పగించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలావుండగా, మరో మూడు రోజుల పాటు అధికారులతో సమావేశాలు జరపనున్న సీఎం, మొత్తం ప్రక్రియను సమీక్షించనున్నారు. ప్రగతి భవన్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసిన 'షాపూర్ జీ-పల్లోంజీ'కే నూతన సచివాలయం పనులను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News