Andhra Pradesh: టీడీపీ ఎంపీలు చట్టబద్ధంగానే బీజేపీలో విలీనమయ్యారు: కిషన్ రెడ్డి

  • రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో విలీనం చేశారు
  • తీర్మాన  ప్రతులను అందించాకే చేర్చుకున్నాం
  • గతంలో ఇలాంటి విలీనాలు 16 సార్లు జరిగాయి

ఏపీ టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, ఆ పార్టీకి వారు రాజీనామా చేసి, రాజ్యసభలో వారి పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందుకు సంబంధించిన తీర్మాన ప్రతులను తమకు అందించాకే వారిని బీజేపీలో చేర్చుకున్నామని, టీడీపీ నేతల చేరికలను అమిత్ షా అంగీకరించినట్టు చెప్పారు అన్నారు. టీడీపీ ఎంపీలు చట్టబద్ధంగానే బీజేపీలో విలీనమయ్యారని, ఈ విషయం తెలియకుండానే కొందరు విమర్శిస్తున్నారని, రాజ్యసభలో గతంలో ఇలాంటి విలీనాలు 16 సార్లు జరిగాయని అన్నారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే విలీనం జరిగిందని, అన్ని నిబంధనలు చూసిన తర్వాతే రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నిబంధనలను అనుసరించి వేరే పార్టీలో చేరతామంటే ఆపే అధికారం ఎవరికీ లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

More Telugu News