Ashok Gehlot: కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు... రాహుల్ వారసుడిగా గెహ్లాత్!

  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం
  • అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా
  • అశోక్ గెహ్లాత్ ను ఎంచుకున్న సోనియాగాంధీ

లోక్‌ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎవరెంతగా నచ్చజెప్పినా పట్టువీడని రాహుల్ గాంధీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ, అహ్మద్‌ పటేల్, ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌ ల బృందం కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాడి గెహ్లాత్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కాంగ్రెస్ తోనూ మంచి అనుబంధం ఉన్న గెహ్లాత్ ఈ పదవికి సరైన వ్యక్తిని వీరు భావించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో కుటుంబ పాలన నడుస్తోందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పవచ్చని కూడా వారు యోచిస్తున్నట్టు సమాచారం. గెహ్లాత్ కు అధ్యక్ష పదవి ఖరారయిందని 'నవభారత్‌ టైమ్స్‌' నేడు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఇదిలావుండగా, 68 ఏళ్ల గెహ్లాత్ గతంలో రెండుసార్లు రాజస్థాన్ కు సీఎంగా పనిచేశారు. ఇప్పుడాయని మూడోసారి సీఎంగా విధుల్లో ఉన్నారు. గత సంవత్సరం రాజస్థాన్ ఎన్నికల తరువాత సీఎంగా సచిన్ పైలట్ ను అనుకున్నప్పటికీ, సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం అశోక్ గెహ్లాత్ వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయనకు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇచ్చి, సీఎం పదవిని సచిన్‌ పైలట్‌ కు ఇవ్వాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News