Mohammed Shami: ప్రపంచకప్‌లో అద్భుత రికార్డు నమోదు చేసిన టీమిండియా పేసర్ షమీ

  • చివరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన షమీ
  • 32 ఏళ్ల తర్వాత భారత ఖాతాలో మరో హ్యాట్రిక్
  • 1987 ప్రపంచకప్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించిన చేతన్ శర్మ

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం సౌతాంప్టన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్బుత రికార్డు నమోదు చేశాడు. గెలుపోటముల మధ్య భారత్ ఊగిసలాడుతున్న వేళ హ్యాట్రిక్‌తో ఆఫ్ఘన్ ఆశలను పటాపంచలు చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం. క్రీజులో మహ్మద్ నబీ ఉన్నాడు.

ఆఫ్ఘాన్‌కు విజయంపై ఆశలు ఉండగా, భారత అభిమానుల్లో ఆందోళన. షమీ తొలి బంతిని విసిరాడు. నబీ ఫోర్ కొట్టాడు. దీంతో ఆప్ఘాన్ విజయానికి కావాల్సిన పరుగుల సంఖ్య 12కు తగ్గింది. నబీ ఖాతాలో అర్ధ సెంచరీ చేరింది. అభిమానుల్లో టెన్షన్ ఎక్కువైంది. షమీ రెండో బంతిని విసిరాడు.  బంతి డీప్ మిడ్‌వికెట్‌లోకి వెళ్లింది. సింగిల్ తీసేందుకు నబీ నిరాకరించాడు. షమీ మూడో బంతిని సంధించాడు. నబీ బలంగా బాదాడు. అయితే, అది సిక్సర్ వెళ్లడానికి బదులు హార్దిక్ పాండ్యా చేతికి చిక్కింది.

భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆప్ఘాన్ అభిమానులు ఉసూరుమన్నారు. షమీ నాలుగో బంతి వేశాడు. అఫ్తాబ్ ఆలం గోల్డెన్ డక్ (బౌల్డ్) అయ్యాడు. షమీ ఐదో బంతి వేశాడు.. ముజీబుర్ రహ్మాన్ గోల్డెన్ డక్ (బౌల్డ్) అయ్యాడు. అంతే.. భారత శిబిరంలో కేరింతలు మిన్నంటాయి. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న నబీ ఖాతాలో హ్యాట్రిక్ వచ్చి చేరింది. మొత్తం 9.5 ఓవర్లు వేసిన సమీ 40 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓ భారత ఆటగాడు ప్రపంచకప్ హ్యాట్రిక్ సాధించడం ఇది రెండోసారి. అది కూడా మూడు దశాబ్దాల తర్వాత. 1987 ప్రపంచకప్‌లో భారత మాజీ పేసర్ చేతన్ శర్మ హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే.

More Telugu News