Jagan: ‘ఆంధ్రప్రదేశ్’ మాస పత్రికలో జగన్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో.. ప్రభుత్వానికి రూ.38 లక్షల నష్టం!

  • ‘ఆంధ్రప్రదేశ్’ కవర్ పేజీపైన ఫొటోపై సీఎంవో గుస్సా
  • జగన్ సీఎం కావడం ఇష్టం లేదన్నట్టు బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఏంటంటూ నిలదీత
  • మొత్తం కాపీలను గోడౌన్‌లో పడేసిన వైనం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేందుకు ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నిర్వహిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వచ్చే ఈ మాసపత్రిక జూన్ ఎడిషన్‌ ముద్రణ పూర్తయినా బయటకు రాలేక గోడౌన్‌లో మూలుగుతోంది. ఇందుకోసం ఖర్చు చేసిన రూ.38 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది.  

‘ఆంధ్రప్రదేశ్’ జూన్ ఎడిషన్‌ కవర్ పేజీపై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫొటోను ముద్రించారు. ఇది చూసిన వైసీపీ నేతలు, అధికారులు పత్రిక ఎడిటర్, సిబ్బందిపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి రావడం ఇష్టం లేనట్టు, నిరసన తెలిపినట్టు ‘బ్లాక్ అండ్ వైట్’ ఫొటో ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఆ ఫొటోకు కూడా ‘జగన్ అను నేను’ అనడానికి బదులు.. ‘జగన్ అను అతను’ అని క్యాప్షన్ పెట్టడం కూడా అధికారుల ఆగ్రహానికి కారణమైంది. దీంతోపాటు ఆ మ్యాగజైన్‌లో మరిన్ని తప్పులు ఉన్నట్టు గుర్తించిన సీఎంవో మొత్తం కాపీలను తీసుకెళ్లి గోడౌన్‌లో పడేసింది. దీంతో వీటి ప్రచురణకు అయిన రూ.38 లక్షలు వృథా అయ్యాయి.

More Telugu News