తెలివితేటల్లో ఇమ్రాన్ ఖాన్ ను మించిపోయిన ప్రత్యేక సహాయకుడు!

Sat, Jun 22, 2019, 09:45 PM
  • సచిన్ ఫొటో పోస్టు చేసి ఇమ్రాన్ ఖాన్ ఫొటోగా పేర్కొన్న వైనం
  • విమర్శనాస్త్రాలు సంధించిన అభిమానులు
  • సెటైర్లతో రిప్లయ్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల కాలంలో అనేక విధాలుగా టార్గెట్ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ, జపాన్ సరిహద్దులను పంచుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. కొన్నిరోజుల క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఓ కవితను ఖలీల్ జిబ్రాన్ ఖాతాలో వేసి మరింతగా నవ్వులపాలయ్యారు. ఇప్పుడాయన ప్రత్యేక సహాయకుడు నయీమ్ ఉల్ హక్ అంతకుమించి తెలివితేటలు ప్రదర్శించడం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

క్రికెట్ బ్యాట్ పైకెత్తి పట్టుకున్న ఓ నూనూగు మీసాల నూత్న యువకుడి ఫొటో ట్విట్టర్ లో పోస్టు చేసి, ఇందులో ఉన్నది మన ప్రధానే, 1969 నాటి ఫొటో అంటూ గొప్పగా ట్వీట్ చేశాడు. వాస్తవానికి ఆ ఫొటోలో ఉన్నది టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. సచిన్ తొలినాళ్ల ఫొటో అది. దాంతో అభిమానులు నయీమ్ ఉల్ హక్ ను ఏకిపడేశారు. ఓ అభిమాని ధోనీ ఫొటో పెట్టి కమ్రాన్ అక్మల్ 2017లో అంటూ సెటైర్ వేయగా, మరొకరు బిన్ లాడెన్ ఫొటో పెట్టి మహ్మద్ యూసుఫ్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad