అల్లు అర్జున్ విగ్రహాన్ని తయారుచేయించిన నవదీప్

22-06-2019 Sat 19:33
  • బన్నీ, నవదీప్ ల మధ్య ఆర్య-2 నుంచి స్నేహం
  • గోన గన్నారెడ్డి లుక్ తో విగ్రహం
  • బన్నీ బావకి ప్రేమతో అంటూ నవదీప్ పోస్ట్
టాలీవుడ్ లో అల్లు అర్జున్, నవదీప్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ గతంలో ఆర్య-2 చిత్రంలో నటించారు. అప్పటినుంచి వారి స్నేహం మరింత విస్తరించింది. తమ స్నేహానికి గుర్తుగా అల్లు అర్జున్ కు ఓ విశిష్ట కానుక ఇవ్వాలని నవదీప్ సంకల్పించాడు. రుద్రమదేవి సినిమాలో బన్నీ పోషించిన గోన గన్నారెడ్డి లుక్ తో ఓ చిన్న విగ్రహాన్ని తయారుచేయించాడు. ఈ విగ్రహాన్ని త్వరలోనే బన్నీకి ఇవ్వనున్నట్టు నవదీప్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. బావకి ప్రేమతో చిరు కానుక అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.