Andhra Pradesh: కేన్సర్ అన్నది నిజంగా ఓ విచిత్రమైన వ్యాధి.. అది రాకుండా ప్రతీఒక్కరూ జాగ్రత్త పడాలి!: నందమూరి బాలకృష్ణ

  • నేడు బసవతారకం ఆసుపత్రి వార్షికోత్సవం
  • హాజరైన నందమూరి బాలకృష్ణ, కోడెల
  • ఎన్టీఆర్-బసవతారకం కుమారుడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమన్న బాలయ్య

హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రిని నిర్మించి 19 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బసవతారకం ఆసుపత్రి 19వ వార్షికోత్సవ వేడుకల్లో హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. తొలుత తల్లిదండ్రులు ఎన్టీఆర్-బసవతారకం విగ్రహాలకు పూలదండలు వేసి బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన సభికులను ఉద్దేశించి మాట్లాడారు.

ఎన్టీ రామారావు, బసవతారకం కుమారుడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ తెలిపారు. ఈ ఆసుపత్రి ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో మంది శ్రమించారని చెప్పారు. ఆసుపత్రిని అద్భుతంగా నడిపిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కేన్సర్ అన్నది ఓ విచిత్రమైన వ్యాధి అనీ, అది రాకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచించారు. కేన్సర్ రోగులకు బసవతారకం ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స అందజేస్తున్నామని టీడీపీ నేత పేర్కొన్నారు.

More Telugu News