Andhra Pradesh: నన్ను అడగకుండా కార్పొరేషన్ లో జగన్ ఫొటో పెడతారా?: అధికారులపై విజయవాడ మేయర్ చిందులు

  • ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు తొలగించడంపై ఆగ్రహం
  • ఎన్టీఆర్ ఫొటోను మళ్లీ యథాస్థానంలో పెట్టాలని ఆదేశం
  • అడ్డుకున్న వైసీపీ.. ఎన్టీఆర్ తో పాటు వైఎస్సార్ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్

కృష్ణా జిల్లాలోని విజయవాడ కార్పొరేషన్ లో ఈరోజు హైడ్రామా నెలకొంది. కార్పొరేషన్ అధికారులు ఈరోజు సమావేశ మందిరంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోను పెట్టారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు ఫొటోలను తొలగించారు. ఈ నేపథ్యంలో హాల్ లోకి వచ్చిన మేయర్ శ్రీధర్.. ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు కనిపించకపోవడంతో అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. ‘నన్ను అడగకుండా సీఎం జగన్ ఫొటో ఎందుకు పెట్టారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫొటోను యథాస్థానంలో పెట్టాలని ఆదేశించారు.

దీనికి వైసీపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. ఒకవేళ ఎన్టీఆర్ ఫొటో పెట్టాల్సి వస్తే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు మేయర్ శ్రీధర్ ఒప్పుకోలేదు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగగా, మేయర్ కు టీడీపీ కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

More Telugu News