vijay: డిఫరెంట్ లుక్స్ తో విజయ్ ఫస్టులుక్

  • అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ 
  • విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్టులుక్
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న విజయ్ డిఫరెంట్ లుక్స్ 

విజయ్ కథానాయకుడిగా అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమాకి 'బిజిల్' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. విజయ్ పుట్టినరోజు నేడు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్లో విజయ్ లుంగీ కట్టుకుని మాస్ లుక్ తోను .. సూట్ ధరించి బిజినెస్ మేన్ లుక్ లోను .. స్పోర్ట్స్ మేన్ గాను కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తున్నాడా? లేదంటే మూడు లుక్స్ తో కనిపించనున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ .. అట్లీ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News