Rajyasabha: న్యాయపరమైన అంశాలు పరిశీలించి చర్యలు చేపడతామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు: ఎంపీ కనకమేడల

  • విలీనం ప్రక్రియ రాజ్యసభ చైర్మన్ పరిధిలో ఉండదు
  • విలీనంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్  
  • వెంకయ్యనాయుడుని కలిసిన కనకమేడల

రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం ప్రక్రియ రాజ్యసభ చైర్మన్ పరిధిలో ఉండదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని టీడీపీ ఎంపీలు కలిసి లేఖ అందజేశారు.

అనంతరం, మీడియాతో కనకమేడల మాట్లాడుతూ, విలీనాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్, చైర్మన్ లకు ఉండవని, దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. న్యాయపరమైన అంశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్టు చెప్పారు. టీడీపీ ని విడిచి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల విషయమై రాజ్యసభ చైర్మన్ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రాజ్యసభ వెబ్ సైట్ లో నలుగురిని బీజేపీ ఎంపీలుగా పేర్కొనడంపై కనకమేడల అభ్యంతరం వ్యక్తం చేశారు.

More Telugu News