Team India: ఫుట్ బాల్ లో రాటుదేలిన టీమిండియా క్రికెటర్లు... 41 కిక్ ల పాటు బంతి గాల్లోనే!

  • కొంతకాలంగా ఇతర ఆటలు ఆడుతున్న క్రికెటర్లు
  • ఫుట్ బాల్ పై పట్టుసాధించిన వైనం
  • వీడియో పోస్టు చేసిన బీసీసీఐ

టీమిండియా క్రికెటర్లు గతకొంతకాలంగా తమ మ్యాచ్ ప్రాక్టీసులో వ్యాయామంతో పాటు అనేకరకాల ఇతర క్రీడలను కూడా చేర్చారు. వాటిలో ఫుట్ బాల్ కూడా ఉంది. మొదట్లో సరదాగానే మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు ప్రొఫెషనల్ లెవల్ కు చేరింది. తాజాగా, వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ కోసం ప్రాక్టీసు సందర్భంగా భారత ఆటగాళ్లు ఎప్పట్లాగానే ఫుట్ బాల్ ఆడారు. బంతిని కిందపడకుండా 41 కిక్ ల పాటు గాల్లోనే ఉంచి తమ సాకర్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. లెగ్ కిక్ లు, హెడర్లతో ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టుచేసింది.

More Telugu News