cpi: బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై వేటు వేయండి: సీపీఐ

  • ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారు
  • ఫిరాయింపులను నిరోధించేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలి
  • వెంకయ్యకు రామకృష్ణ లేఖ

నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు కూడా గడవక ముందే టీడీపీపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందంటూ పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ తీరుపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు.

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై వేటు వేయాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకి ఆయన లేఖ రాశారు. ఫిరాయింపులను నిరోధించేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్టీ మారడం ద్వారా ఆ నలుగురు ఎంపీలు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 

More Telugu News